లోక్‌సభలో ‘ఆపరేషన్ సిందూర్’పై జరిగిన చర్చ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రసంగం సమయంలో విపక్షాలు పదేపదే అడ్డుకోవడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. జైశంకర్ మాట్లాడుతూ పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కాల్పుల విరమణ వాదనలను ఖండించారు. మోదీ, ట్రంప్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని స్పష్టం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను విపక్షాలు అడ్డుకోవడంతో అమిత్ షా జోక్యం చేసుకొని ఘాటుగా విమర్శించారు.
“విపక్షాలు తమ దేశ విదేశాంగ మంత్రిని నమ్మకుండా ఇతర దేశాల వాదనలను నమ్మడం ఆక్షేపణీయం. వారి పార్టీలో విదేశీ ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోగలను. కానీ దానిని ఈ సభపై రుద్దడం సరికాదు. అందుకే వారు ఈ రోజు విపక్ష బెంచీల్లో కూర్చున్నారు. రాబోయే 20 సంవత్సరాలు కూడా వారు అక్కడే ఉంటారు” అని షా విమర్శించారు.
అయితే విపక్షాలు అడ్డుకోవడం కొనసాగించడంతో అమిత్ షా మరోసారి హెచ్చరించారు. “వారి నాయకులు మాట్లాడినప్పుడు మేము ఓపికగా విన్నాం. రేపు వారు చెప్పిన అబద్ధాల జాబితాను సభ ముందు పెడతాను. కానీ సత్యాన్ని జీర్ణించుకోలేకపోవడం బాధాకరం. ఇంత ముఖ్యమైన అంశంపై విదేశాంగ మంత్రి మాట్లాడుతుంటే ఇలాంటి అడ్డంకులు తగవు” అని షా స్పష్టం చేశారు.
Read More : కేరళ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు కాలేదు

2 thoughts on “లోక్‌సభలో ‘ఆపరేషన్ సిందూర్’పై తీవ్ర రచ్చ”
Comments are closed.