ఆంధ్రప్రదేశ్లో మరోసారి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కోనసీమ జిల్లా రాయవరం మండలంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థినిపై పాఠశాల ప్రిన్సిపాల్ లైంగిక దాడి చేసిన సంఘటన బయటపడింది. పోలీసుల సమాచారం ప్రకారం, నిందితుడు జయరాజు నాలుగు నెలల క్రితం విద్యార్థినిపై దారుణంగా లైంగిక దాడి చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తానని బెదిరిస్తూ పలుమార్లు దుర్మార్గానికి ఒడిగట్టాడు. దీంతో బాలిక గర్భం దాల్చిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది.
ఈ సంఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కాగా, నిందితుడు జయరాజు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు.
Read More : శ్రీవారికి బంగారు శంకు చక్రాలు – భక్తి కానుకా

One thought on “ప్రిన్సిపాల్ దారుణం – విద్యార్థిని గర్భవతిగా?”
Comments are closed.