ఝార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ఝార్ఖండ్‌లో శ్రావణమాసం సందర్భంగా కన్వర్ యాత్రకు వెళ్తున్న భక్తులకు ఘోర ప్రమాదం సంభవించింది. భక్తులతో వెళ్తున్న ఒక బస్సు ట్రక్కును ఢీకొట్టడంతో 18 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

పోలీసుల సమాచారం ప్రకారం, ప్రమాదం జమ్షెడ్‌పూర్ సమీపంలో చోటుచేసుకుంది. బస్సులో ఉన్న భక్తులు శ్రావణమాసం సందర్భంగా కన్వర్ యాత్రలో పాల్గొనేందుకు బయలుదేరగా ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.

గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపి, అవసరమైన సహాయాన్ని అందిస్తామని ప్రకటించింది.

Read More : లోక్‌సభలో ‘ఆపరేషన్ సిందూర్’పై తీవ్ర రచ్చ

One thought on “ఝార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Comments are closed.