ఆపరేషన్ సిందూర్, మహదేవ్ ఉగ్రవాద నిర్మూలనలో కీలక పాత్ర పోషించాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్‌సభలో ఈ ఆపరేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రసంగానికి ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. “దేశ భద్రతపై ప్రజలకు భరోసా కల్పించేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అమిత్ షా లోక్‌సభలో విపులంగా వివరించారు” అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా ప్రసంగం గల 1.14 నిమిషాల వీడియోను కూడా పంచుకున్నారు.
ఇక, లోక్‌సభలో అమిత్ షా ప్రతిపక్షాల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం అభివృద్ధి చెందకపోవడానికి, పీవోకే ఉనికికి అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూనే కారణమని ఆరోపించారు. 1948లో భారత సైన్యం పీవోకేను చేజిక్కించుకునే స్థితిలో ఉన్నప్పటికీ నెహ్రూ ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించడంతో ఆ అవకాశం చేజారిపోయిందని వ్యాఖ్యానించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా నెహ్రూ నిర్ణయాలను వ్యతిరేకించారని షా గుర్తుచేశారు.
Read More : లోక్‌సభలో ‘ఆపరేషన్ సిందూర్’పై తీవ్ర రచ్చ

One thought on “ఆపరేషన్ సిందూర్‌పై మోదీ స్పందన”
Comments are closed.