గచ్చిబౌలిలో ఐటీ ఉద్యోగులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఘటన చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం, ఐటీ ఉద్యోగులను తీసుకెళ్తున్న ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును ఆపి, అందులో ఉన్న ఉద్యోగులను సురక్షితంగా కిందికి దింపడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
తక్షణమే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో, ఫైర్ ఇంజన్ హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుంది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. బస్సులో మంటలు ఎలా చెలరేగాయో తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
Read More : మరోసారి వివాదంలో నటి కల్పిక (Video)
