సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రకటించిన పరిహారం ఇప్పటికీ అందలేదని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి కుటుంబానికి రూ.1 కోటి పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, రోజులు గడిచినా ఇప్పటివరకు అమలు చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో హరీశ్ రావు సంగారెడ్డి అదనపు కలెక్టర్‌ను కలిసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పరిహారం కోసం బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయని, ఎప్పుడు అందిస్తారో అధికారుల నుండి స్పష్టత లేదని పేర్కొన్నారు. కొన్ని కుటుంబాలకు కేవలం లక్ష రూపాయలు మాత్రమే అందజేయడం అన్యాయమని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే మృతులు, గాయపడిన వారి వివరాలను అధికారికంగా ఇంకా ప్రకటించకపోవడాన్ని హరీశ్ రావు తప్పుపట్టారు. ఎంతమందికి ఎంత పరిహారం ఇచ్చారో ప్రభుత్వం వెంటనే వెల్లడించి, మిగతా కుటుంబాలకు ప్రకటించిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Read More : మీనాక్షి నటరాజన్ పాదయాత్ర షెడ్యూల్ విడుదల

One thought on “సిగాచీ బాధితులకు పరిహారం ఆలస్యం పై హరీశ్ రావు ఆవేదన”
Comments are closed.