హైదరాబాద్‌లో రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో ఇటీవల వెలుగులోకి వచ్చిన రేవ్ పార్టీ కేసులో ఎక్సైజ్ పోలీసులు కీలక విషయాలను బయటపెట్టారు. ఈ పార్టీలను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అశోక్ నాయుడు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ప్రతి వీకెండ్‌లో ఏపీ నుంచి యువతీ యువకులను హైదరాబాద్‌కు తీసుకువచ్చి ఈ రేవ్ పార్టీలను ఏర్పాటు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. దాడుల సమయంలో అశోక్ నాయుడు వద్ద నుంచి గంజాయి, డ్రగ్స్, కండోమ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. డ్రగ్స్ అలవాటు ఉన్న యువతను లక్ష్యంగా చేసుకుని పార్టీలను నిర్వహించాడని స్పష్టం చేశారు. అరెస్టయిన వారిలో మంగళగిరి, విజయవాడ, కాకినాడ, రాజమండ్రికి చెందిన 11 మంది ఉన్నట్లు తెలిసింది.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, అశోక్ నాయుడు ఉపయోగించిన ఫార్చునర్ కారు (AP 39 SR 0001)పై లోక్‌సభ ఎంపీ స్టిక్కర్ ఉండటం. ఈ స్టిక్కర్‌ను ఎవరి ద్వారా పొందాడనే దానిపై విచారణ కొనసాగుతోందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు శ్రీనివాస్ చౌదరి, అఖిల్ పరారీలో ఉన్నట్లు సమాచారం.

ఈ రేవ్ పార్టీలు కొండాపూర్‌లోని ఎస్‌వీ నిలయం సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో జరిగాయని, అందిన సమాచారం ఆధారంగా దాడులు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Read More : సిగాచీ బాధితులకు పరిహారం ఆలస్యం పై హరీశ్ రావు ఆవేదన

One thought on “హైదరాబాద్‌లో రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి

Comments are closed.