పదేళ్ల కూతురిపై తండ్రి అఘాయిత్యం

నారాయణపేట జిల్లాలో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరికల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన కుర్వ కుర్మయ్య అనే వ్యక్తి తన పదేళ్ల చిన్న కూతురిపై దారుణానికి పాల్పడ్డాడు.

సమాచారం ప్రకారం, కుర్మయ్యకు ముగ్గురు కుమార్తెలు ఉండగా, వారు మక్తల్‌లోని ప్రభుత్వ హాస్టల్‌లో చదువుతున్నారు. కుక్క కరవడంతో 5వ తరగతి చదువుతున్న చిన్న కుమార్తె గ్రామంలోని పాఠశాలలో కొనసాగుతోంది. ఈ నెల 25న తల్లి కూలీ పనులకు వెళ్లిన సమయంలో, మేకల దగ్గర పని చేస్తున్న తండ్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చి చదువుకుంటున్న చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

“నాన్నా నీ కాళ్లు మొక్కుతా.. నన్ను ఏమీ చేయొద్దు” అని బాలిక ఎంత వేడుకున్నా తండ్రి కనికరించకపోవడంతో గట్టిగా కేకలు వేసింది. బాలిక కేకలు విని స్థానికులు అక్కడికి చేరుకుని రక్తస్రావంలో ఉన్న చిన్నారిని కాపాడారు. తరువాత తల్లి ఇంటికి చేరుకుని కూతురి పరిస్థితి గమనించి మొదట గ్రామంలోని ఆర్ఎంపీ వద్ద చికిత్సకు తీసుకెళ్లింది. అయితే పరిస్థితి విషమించడంతో మరికల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు.

శనివారం మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పోలీసు కంప్లైంట్ ఇస్తేనే చికిత్స అందిస్తామని చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఆదివారం బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న తండ్రి కోసం గాలింపు ప్రారంభించారు.

Read More : బీఆర్ఎస్ విలీనం ప్రశ్నే లేదు – కేటీఆర్ స్పష్టం

One thought on “పదేళ్ల కూతురిపై తండ్రి అఘాయిత్యం

Comments are closed.