మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి రిమాండ్ – టీడీపీ పగ తీర్చుకుందా?

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణం కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి 10 రోజుల రిమాండ్‌ విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. అనంతరం పోలీసులు ఆయనను రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు.

ఈ కేసులో మిథున్ రెడ్డి పాత్రపై సాక్ష్యాలను పరిశీలిస్తున్నామని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఇదే జైలులో ఇంతకుముందు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్‌ జైలులో భార్య, కుమారుడు కలిసి పరామర్శించారు. కుటుంబసభ్యుల భేటీకి జైలు అధికారులు అనుమతి ఇచ్చారు.

ఈ కేసుపై దర్యాప్తు వేగవంతం చేయనున్నట్లు ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.

Read More : ఏపీ డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు

One thought on “మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి రిమాండ్ – టీడీపీ పగ తీర్చుకుందా?

Comments are closed.