ముంబై రైళ్లలో భారీగా మొబైల్‌ చోరీలు

ముంబై లోకల్‌ రైళ్లలో మొబైల్‌ ఫోన్‌ దొంగతనాలు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. గత 30 నెలల వ్యవధిలో మొత్తం 26 వేలకుపైగా మొబైల్‌ ఫోన్లు దొంగల బారిన పడ్డాయని గ్రిప్‌ (రైల్వే పోలీసులు) వెల్లడించారు. ఈ ఫోన్ల అంచనా విలువ సుమారు 62 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కేసుల్లో సుమారు 45 శాతం దర్యాప్తు పూర్తిచేసి పరిష్కరించామని, ఇప్పటివరకు దాదాపు 20 కోట్ల రూపాయల విలువైన ఫోన్లు తిరిగి స్వాధీనం చేసుకున్నామని గ్రిప్‌ అధికారులు తెలిపారు. అదేవిధంగా సుమారు 500 మొబైల్‌ ఫోన్లను త్వరలో యజమానులకు తిరిగి అందజేయనున్నట్లు వెల్లడించారు.

రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచుకోవాలని రైల్వే పోలీసులు విజ్ఞప్తి చేశారు. మొబైల్‌ దొంగతనాలపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేస్తున్నామని అధికారులు తెలిపారు.

Read More : Update – పాఠశాల పైకప్పు కూలి ఏడుగురు చిన్నారుల మృతి

One thought on “ముంబై రైళ్లలో భారీగా మొబైల్‌ చోరీలు

Comments are closed.