విచారణకు హాజరుకాని అనిల్ కుమార్ యాదవ్?

ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు హాజరు కావలసిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈసారి హాజరు కాలేనని కోర్టుకు సమాచారం అందించారు. వ్యక్తిగత కారణాలు ఉన్న కారణంగా విచారణకు రావడం సాధ్యం కాదని ఆయన తెలియజేశారు. అంతేకాక, ఈ కేసులో కోర్టులో ఇప్పటికే క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, విచారణకు హాజరయ్యే కొత్త తేదీని తన న్యాయవాదుల ద్వారా తరువాత తెలియజేస్తానని తెలిపారు. ఈ పరిణామంతో విచారణను మరో తేదీకి వాయిదా వేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Read More : ఆంధ్రప్రదేశ్‌ను రక్షణ హబ్‌గా తీర్చిదిద్దాలని టీడీపీ వినతి