హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు

బీఆర్ఎస్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు రాజేంద్రనగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు బీఎన్ఎస్ 356(2), 353(B), 352 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Read More : షాద్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

One thought on “హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు

Comments are closed.