నిద్రమత్తులో ఇంటి గోడపైకి ఎక్కిన వాహనం

మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలోని శంభీపూర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. సమాచారం ప్రకారం, నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ కారు నియంత్రణ కోల్పోయి ఇంటి గోడపైకి ఎక్కించాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్రేన్ సహాయంతో కారును దింపారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More : జూలై 28కి వాయిదా పడిన తెలంగాణ కేబినెట్ సమావేశం