ఆర్సీబీ బౌలర్ యాష్ దయాళ్‌పై పోక్సో కేసు నమోదు!

ఆర్సీబీ బౌలర్ యాష్ దయాళ్‌పై పోక్సో కేసు నమోదైంది. క్రికెట్ కెరీర్‌లో సలహాలు ఇస్తానని నమ్మించి, సీతాపురలోని ఓ హోటల్‌కు పిలిచి తనపై లైంగిక దాడి చేశాడని రాజస్థాన్‌కు చెందిన యువతి ఆరోపించింది. ఆ తర్వాత తనను బ్లాక్‌మెయిల్ చేస్తూ రెండేళ్ల పాటు పలుమార్లు అత్యాచారానికి గురి చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగిక వేధింపులు ప్రారంభమైన సమయంలో యువతి వయస్సు 17 సంవత్సరాలే కావడంతో, పోలీసులు యాష్ దయాళ్‌పై పోక్సో కేసు నమోదు చేశారు.

ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో యువతి కూడా యాష్ దయాళ్‌పై ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంట్లో పరిచయం చేసి, ఐదేళ్లు కలిసి ఉంటూ శారీరకంగా, మానసికంగా హింసించాడని ఆరోపించింది. తర్వాత వేరే మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులపై విచారణ కొనసాగుతుండగా, యాష్ దయాళ్ కోర్టులో స్టే తెచ్చుకుని తాత్కాలిక ఉపశమనం పొందినట్లు సమాచారం.

Read More : చైనా ఓపెన్‌లో సింధు, ఉన్నతి, సాత్విక్-చిరాగ్ విజయాలు

One thought on “ఆర్సీబీ బౌలర్ యాష్ దయాళ్‌పై పోక్సో కేసు నమోదు!

Comments are closed.