ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన “హరిహర వీరమల్లు” సినిమా నేడు భారీగా థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ పాల్గొని తన అనుభవాలను, భావాలను పంచుకున్నారు.
పవన్ మాట్లాడుతూ, “నేను నన్నెప్పుడూ హీరోగా భావించలేదు. కానీ విధి నన్ను హీరోగా, తర్వాత రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దింది. హరిహర వీరమల్లు ఎంత పెద్ద విజయం సాధించిందనేది నాకు తెలియదు. కానీ పీరియాడిక్ చిత్రాల్లో వీఎఫ్ఎక్స్ కంటే భావోద్వేగాలు ముఖ్యమని ఎప్పుడూ నమ్ముతాను. మొఘల్ చరిత్రను గొప్పగా చెబుతారు కానీ మన రుద్రమదేవి, శ్రీకృష్ణదేవరాయల మహత్తును ఎందుకు చరిత్రలో చెప్పరని ఎప్పుడూ ఆలోచిస్తుంటాను. ఔరంగజేబ్ చేసిన దారుణాలను చరిత్రకారులు దాచిపెట్టారు. ఈ సినిమాలో ఆ విషయాలను ప్రస్తావించడం నాకు గర్వకారణం” అని అన్నారు.
అలాగే, “హరిహర వీరమల్లు క్లైమాక్స్ సీన్ అందరికీ నచ్చడం సంతోషంగా ఉంది. సెకండ్ పార్ట్ ఇప్పటికే 30 శాతం పూర్తయింది. త్వరలోనే పూర్తి చేస్తామని ఆశిస్తున్నాను. మా సినిమాను బహిష్కరించేందుకు ప్రయత్నాలు జరిగాయి. నా సినిమా వాళ్లను అంతగా భయపెట్టిందా అనిపించింది. హిందువులపై జిజియా పన్ను విధించిన చరిత్రను ఎందుకు ఎవరూ ప్రశ్నించలేదనే అంశాన్ని ఈ సినిమాలో ప్రస్తావించటం చాలా అవసరం అనిపించింది” అన్నారు.
పవన్ కళ్యాణ్ మరోవైపు, “హరిహర వీరమల్లు పార్ట్-1లో ఏవైనా లోపాలు ఉంటే చెప్పండి. వాటిని సెకండ్ పార్ట్‌లో సరిచేస్తాం. మా సినిమా గురించి నెగటివ్‌గా మాట్లాడుతున్నారంటే మేము బలమైన వాళ్లమనే అర్థం. నేను ఎప్పుడూ డిప్రెషన్‌కు లోనవ్వను. విజయం కంటే ఎలా నిలబడాలో నేర్చుకోవడం ముఖ్యం” అని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా పవన్ స్పీచ్ అభిమానుల్లో ఉత్సాహం నింపగా, సెకండ్ పార్ట్ కోసం మరింత ఆసక్తి పెంచింది.
Read More : రక్తంతో పవన్ కళ్యాణ్ చిత్రం గీసిన దేశెట్టి శ్రీనివాసులు

One thought on “హరిహర వీరమల్లు సక్సెస్ మీట్లో పవన్ భావోద్వేగాలు”
Comments are closed.