Photos : గుజరాత్‌లో అల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్

గుజరాత్‌లో పెద్ద ఎత్తున అల్‌ఖైదా ఉగ్రవాదుల పట్టివేత జరిగింది. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ (ఏటీఎస్) నాలుగురు అల్‌ఖైదా ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్టు అధికారికంగా ప్రకటించింది. వీరిలో ఇద్దరిని గుజరాత్‌లోనే అదుపులోకి తీసుకోగా, మరొకరిని ఢిల్లీలో, ఇంకొకరిని నోయిడాలో పట్టుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే గుజరాత్ ఏటీఎస్, స్థానిక పోలీసుల సహకారంతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి ఈ ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు తెలిపింది. అరెస్టైన నిందితులు దేశంలో ఉగ్రపరిస్థితులు సృష్టించేందుకు కుట్రలు పన్నినట్టు దర్యాప్తులో తెలిసిందని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు కేంద్రీయ ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. అరెస్టైన ఉగ్రవాదులు ఏ ఉద్దేశ్యంతో గుజరాత్, ఢిల్లీ, నోయిడాల్లో ఉన్నారు? ఎవరితో సంబంధాలు పెట్టుకున్నారు? దేశంలో ఏవైనా దాడుల పథకాలు సిద్ధం చేసారా? వంటి అంశాలపై దర్యాప్తు జరుగుతోంది.

ఈ ఆపరేషన్‌తో ఒక పెద్ద ఉగ్రపథకం భగ్నమైందని ఏటీఎస్ పేర్కొంది.

Read More : బ్రిటన్ పర్యటనకు ప్రధాని మోదీ..