కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మరియు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చిన ఘటన కలకలం రేపుతోంది. ‘సింధార్ రాజపుత్’ అనే పేరుతో పంపిన ఈమెయిల్ బెదిరింపులపై విధానసౌద పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
పోలీసుల వివరాల ప్రకారం, అసభ్యమైన భాషతో కూడిన ఈమెయిల్‌లు అధికారిక ఇమెయిల్ ఐడీలకు వచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన అధికారులు వెంటనే స్పందించి, సైబర్ క్రైమ్ విభాగంతో కలిసి విచారణ ప్రారంభించారు. ఈమెయిల్‌లు ఎక్కడినుంచి వచ్చాయి? ఎవరు పంపారు? అనే దానిపై ప్రస్తుతం లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రభుత్వ ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకున్న ఈ బెదిరింపులు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ప్రభుత్వ వర్గాలు మాత్రం భద్రతా చర్యలు మరింత కఠినంగా అమలు చేస్తామని వెల్లడించాయి.
ఇంతలో, ఈ బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
Read More : కేంద్రం అత్యంత గంభీరంగా స్పందించింది

One thought on “కర్ణాటక సీఎంపై బెదిరింపులు”
Comments are closed.