ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం బ్రిటన్ బయల్దేరారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కింగ్ చార్లెస్‌ను, బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ను ప్రత్యేకంగా కలవనున్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్య ఒప్పందాలు, పెట్టుబడుల ప్రోత్సాహం, వాతావరణ మార్పు వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. భారత్-బ్రిటన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆర్థిక సంబంధాలపై ఈ పర్యటన కొత్త దిశలో ముందుకు తీసుకెళ్తుందని అంచనా వేస్తున్నారు.
ప్రధాని మోదీ ఈ పర్యటనలో భారతీయ సమాజ ప్రతినిధులను కూడా కలవనున్నారు. ఈ సమావేశాలు రెండు దేశాల మధ్య స్నేహ బంధాన్ని మరింత బలపరిచేలా ఉంటాయని అధికారులు వెల్లడించారు.
Read More : ఉపరాష్ట్రపతి ఎన్నికల కసరత్తు ప్రారంభం

One thought on “బ్రిటన్ పర్యటనకు ప్రధాని మోదీ..”
Comments are closed.