జగదీప్ ధన్‌కడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవి కోసం త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించింది. కసరత్తు పూర్తయిన వెంటనే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఎలక్టోరల్ కాలేజీ సిద్ధం చేయడంలో భాగంగా రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించడంలో ఎన్నికల సంఘం బిజీగా ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి పదవులు ఖాళీ అయినప్పుడు ఎన్నికల బాధ్యతలు ఎన్నికల సంఘానికే ఉంటాయి. ఆ మేరకు ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఈసీ సన్నాహాలు చేస్తోంది.
అనారోగ్య కారణాల వల్ల తాను ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకుంటున్నానని పేర్కొంటూ జగదీప్ ధన్‌కడ్ సోమవారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా సమర్పించారు. రాష్ట్రపతి ఆ రాజీనామాను ఆమోదించగా, కేంద్ర హోంశాఖ దానిని పార్లమెంట్ ఉభయసభలకు సభాధ్యక్షుల ద్వారా తెలియజేసింది.
Read More : క్యూ లో దూరవద్దన్న రిసెప్షనిస్ట్‌పై దారుణ దాడి

One thought on “ఉపరాష్ట్రపతి ఎన్నికల కసరత్తు ప్రారంభం”
Comments are closed.