న్యూఢిల్లీ: రాజకీయ ప్రయోజనాల కోసం ప్రైవేటుగా ఉపయోగపడుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై భారత సుప్రీంకోర్టు ముఖ్య న్యాయమూర్తి బీఆర్ గవాయ్ ధర్మాసనం సోమవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈడీ అధికారుల ప్రవర్తనపై విచారణ జరుపుతున్న సందర్భంగా గవాయ్ ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేశారు.
“ఈడీ అధికారుల ప్రవర్తన హద్దులు దాటి వెళ్తోంది. వారు రాజకీయ యుద్ధాల్లో పావులుగా మారకూడదు. ఈ స్థితిలో ఉంటే మీ గురించి మరింత కఠినంగా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది” అని బీఆర్ గవాయ్ తీవ్ర హెచ్చరిక చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు, ఈడీ దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందని సూచించింది. రాజకీయ ప్రయోజనాల కోసం ఈడీని ఉపయోగిస్తున్న ఘటనలు దేశంలో ప్రజాస్వామ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని కోర్టు అభిప్రాయపడింది.
మద్రాస్ హైకోర్టు కూడా ఈడీపై మండిపాటు
ఇటీవల మరో అంశంలో మద్రాస్ హైకోర్టు కూడా ఈడీపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. “ఈడీ ప్రతి నేరాన్ని విచారించాల్సిన సూపర్ పోలీస్ కాదు. ప్రతి కార్యకలాపంపై దాడి చేసేందుకు డ్రోన్లా తిరుగే అధికారం ఈడీకి లేదు” అంటూ వ్యాఖ్యానించింది.
ఈ పరిణామాలన్నీ ఈడీ తీరుపై జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. అధికార బలాన్ని పక్కదోవలో వినియోగించడంపై న్యాయస్థానాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Read More : ముడా వివాదం: సుప్రీంకోర్టు తిప్పికొట్టింది

One thought on “సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు”
Comments are closed.