కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ కన్నుమూత

కేరళ రాజకీయాల్లో కీలక నేతగా పేరొందిన మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ ఇకలేరు. గత నెల 23న గుండె సంబంధిత సమస్యలతో ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో అనేక రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, చికిత్స పొందుతుండగానే ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.

మార్క్సిస్ట్ కమ్యూనిస్టు పార్టీ (CPIM) కు చెందిన అచ్యుతానందన్ 2006 నుంచి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ప్రజలతో నిత్యం నేరుగా మమేకమవుతూ, సాధారణ ప్రజానీకానికి అండగా నిలిచిన ప్రజాప్రియ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన మృతి పట్ల కేరళ వ్యాప్తంగా రాజకీయ, సామాజిక వర్గాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాయి.

వయస్సు మీద పడినా… ప్రజాసేవలో అచల నమ్మకంతో కొనసాగిన అచ్యుతానందన్… తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజల హక్కుల కోసం పోరాడిన యోధుడిగా చరిత్రలో నిలిచిపోయారు.

Read More : వంతెనపై నుంచి బస్సు కాలువలోకి పడిన ఘటన

One thought on “కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ కన్నుమూత

Comments are closed.