ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంపై మంత్రి రామ్మోహన్ కీలక ప్రకటన

గత నెల అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంపై కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేశారు. ప్రమాదంపై ప్రాథమిక నివేదిక ఇప్పటికే అందిందని, దానిపై సమగ్రంగా పరిశీలన జరుగుతోందని తెలిపారు. తుది నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు బహిర్గతమవుతాయని చెప్పారు. రాజ్యసభలో మాట్లాడిన మంత్రి రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ, “ఈ ఘటనపై అంతర్జాతీయ నిబంధనల ప్రకారం దర్యాప్తు ప్రారంభించాం. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) పారదర్శకంగా దర్యాప్తు చేస్తోంది. అయితే, కొందరు విదేశీ మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మేము తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం” అని తెలిపారు.

బ్లాక్‌బాక్స్‌ తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, అందులోని డేటాను విజయవంతంగా రికవర్ చేసి, తొలిసారి డీకోడ్ చేయగలిగామని వెల్లడించారు. ఈ ఘటనపై తుది నివేదిక అనంతరం మరింత స్పష్టత వస్తుందని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. అలాగే, దేశవ్యాప్తంగా విమానాశ్రయాల అభివృద్ధికి, విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

Read More : గంగా నది నీటి మట్టం ప్రమాదస్థాయికి చేరువ.?

One thought on “ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంపై మంత్రి రామ్మోహన్ కీలక ప్రకటన

Comments are closed.