వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రూప్లతండాకు చెందిన ముగ్గురు సంవత్సరాల చిన్నారి నితిన్‌ వీధిలో ఆడుకుంటుండగా ఆకాల వీధికుక్కల దాడికి గురయ్యాడు. కుక్కలు తీవ్రంగా గాయపరిచిన చిన్నారిని కుటుంబ సభ్యులు నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతుండగానే నితిన్ మృతి చెందాడు. ఈ విషాదకర ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. చిన్నారి ప్రాణం పోవడంపై ప్రజల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. స్థానికులు తక్షణమే వీధికుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Read More : కేంద్ర మంత్రుల రైలు ప్రయాణం…