విశాఖపట్నం గండిగుంట ప్రాంతంలోని ఐటీసీ గోదాములో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోదాంలో ఉన్న సిగరెట్లు, బింగో ప్యాకెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు హఠాత్తుగా చెలరేగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఎనిమిది ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అనుసంధానంగా ప్రాణ నష్టం లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు.
Read More : అనంతపురంలో విషాదం.. దోసె ముక్కతో చిన్నారి మృతి

One thought on “విశాఖ ఐటీసీ గోదాములో అగ్నిప్రమాదం.. భారీ ఆస్తి నష్టం”
Comments are closed.