టాలీవుడ్ హీరో రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు కన్నుమూత

టాలీవుడ్ నటుడు రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు (వయస్సు 90) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని రవితేజ నివాసంలో నిన్న రాత్రి ఆయ‌న తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో రవితేజ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజగోపాల్ రాజు మృతితో టాలీవుడ్‌లో విషాద వాతావరణం నెలకొంది. ఈ వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఉదయాన్నే రవితేజ నివాసానికి చేరుకున్న వారు ఆయన తండ్రి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. రవితేజ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

Read More : రామాయణ బడ్జెట్ రివీల్ చేసిన నిర్మాత.. బడ్జెట్ తెలిస్తే కళ్ళు తిరగాల్సిందే!!

One thought on “టాలీవుడ్ హీరో రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు కన్నుమూత

Comments are closed.