మల్నాడు కిచెన్ డ్రగ్స్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజా విచారణలో ఈగల్ టీమ్ అనేక సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. కొరియర్ల ద్వారా మల్నాడు కిచెన్‌కి డ్రగ్స్ రాగడం, ఆయా డ్రగ్స్‌ను ఆర్డర్ల ప్రకారం వివిధ చోట్ల పంపిణీ చేయడం జరిగిందని అధికారులు నిర్ధారించారు. ఈ డ్రగ్ నెట్వర్క్కి మల్నాడు కిచెన్ యజమాని సూర్యే కీలకంగా వ్యవహరించినట్లు ఈగల్ టీమ్ గుర్తించింది. అతడు అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌లోని 20కి పైగా పబ్బులకు సూర్య డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆధారాలు లభించాయి. ప్రముఖులకు కూడా ఇంటికే డోర్ డెలివరీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. గోవాలో నైజీరియన్ వ్యక్తి నిక్ నుంచి కొకైన్, ఎమ్డీఎమ్ఏ వంటి మత్తు పదార్థాలను సూర్య కొనుగోలు చేసినట్లు తెలిసింది. వీటి కోసం హాస్పిటల్ ట్రీట్మెంట్ పేరుతో రూ.1.8 లక్షలు అతను ట్రాన్స్ఫర్ చేసినట్లు ఈగల్ టీమ్ గుర్తించింది. ‘శ్రీ మారుతి కొరియర్’ పేరుతో డ్రగ్స్ ప్యాకెట్లు పంపిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. గర్ల్స్ చెప్పుల హీల్స్‌లో దాచి పెట్టిన కొకైన్, ఎక్స్టసీ పిల్స్, ఓజీ కుష్ ఆయిల్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, 15మంది డాక్టర్లకు కొరియర్ల ద్వారా డ్రగ్స్ అందినట్లు సమాచారం.
సూర్య, ముగ్గురు పబ్ యజమానులతో కలిసి డ్రగ్ పార్టీలను నిర్వహించారని ఈగల్ టీమ్ చెబుతోంది. ఫామ్ పబ్, బర్డ్ బాక్స్, బ్లాక్ 22, వాక్ కోరా, బ్రాడ్ వే పబ్బుల్లో ఈ పార్టీలు జరిగినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో వాక్ కోరా, బ్రాడ్ వే పబ్ యజమానులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ప్రస్తుతం క్వాక్ పబ్ ఓనర్ రాజశేఖర్, కోరా పబ్ యజమాని పృథ్వీ వీరమాచినేని, బ్రాడ్ వే పబ్ యజమాని రోహిత్ మాదిశెట్టిలపై కేసులు నమోదయ్యాయి. వీరు డ్రగ్ పార్టీలకు సహకరించినట్లు సూర్య పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ముగ్గురికి నోటీసులు జారీ చేసి, విచారణకు హాజరుకావాల్సిందిగా సూచించనున్నారు.
Read More : నిమ్స్‌లో టాయిలెట్ పైపులో పసిపాప మృతదేహం

One thought on “మల్నాడు కిచెన్ డ్రగ్స్ కేసు – పబ్‌లు, డాక్టర్ల వరకు డోర్ డెలివరీ!”
Comments are closed.