తల్లితో ముఖాముఖి సమావేశమైన లోకేశ్

పుట్టపర్తిలో నిర్వహించిన ‘మెగా పీటీఎం 2.0’ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూనియర్ కళాశాల ప్రాంగణంలో “రచ్చబండ” కార్యక్రమాన్ని నిర్వహించి, తల్లిదండ్రులు, విద్యార్థులతో ప్రత్యక్షంగా ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ “తల్లికి వందనం” పథకం ద్వారా లబ్దిదారైన పి. మాధవి అనే తల్లిని ఆమె నలుగురు పిల్లలతో కలిసి కలిశారు. ఆమె పిల్లలు బాలు (8వ తరగతి), నరసమ్మ (7వ తరగతి), బేబీ (5వ తరగతి), సన (3వ తరగతి)లతో మానవీయంగా మాట్లాడారు. పథకం కింద మాధవికి రూ.52 వేల ఆర్థిక సహాయం అందిందని ఆమె తెలిపారు. ఈ మొత్తం పిల్లల పేర్లతో బ్యాంకులో వేసినట్టు పేర్కొన్నారు. మాధవితో మంత్రి లోకేశ్ పాఠశాలలో వసతులపై ప్రశ్నలు వేసి, యూనిఫాం, మధ్యాహ్న భోజనం నాణ్యతపై విద్యార్థుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు భోజనం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు.

పిల్లలతో మాట్లాడిన మంత్రి, వారిని బాగా చదవాలంటూ ప్రోత్సహించారు. ఉన్నత విద్య భవిష్యత్తును ప్రభుత్వం భరోసా ఇస్తుందని హామీ ఇచ్చారు. మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం అందిస్తున్నామని, పుస్తకాల బ్యాగ్ భారం తగ్గించేందుకు సెమిస్టర్ విధానం ప్రవేశపెట్టామని చెప్పారు.

తల్లి మాధవి, విద్యార్థులు మంత్రి చూపిన ఆప్యాయతపై ఆనందం వ్యక్తం చేశారు. “తల్లికి వందనం” పథకం లబ్ధిదారులకు ఇది మానవీయతకు నిదర్శనంగా నిలిచింది.

One thought on “తల్లితో ముఖాముఖి సమావేశమైన లోకేశ్

Comments are closed.