టెక్సాస్‌లో వరద విషాదం: 109 మృతి, 160 గల్లంతు

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో భారీ వరదలు ఘోర విపత్తుకు దారితన్నాయి. టెక్సాస్‌లోని కెర్ కౌంటీలో గ్వాడలుపే నది పరిసర ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఈ వరదలతో ‘క్యాంప్ మిస్టిక్’ అనే సమ్మర్ క్యాంప్ తీవ్రంగా ప్రభావితమైంది. ఈ విపత్కర ఘటనలో 109 మంది చిన్నారులు, కౌన్సిలర్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా 160 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. ఈ వరదలు హంట్ ప్రాంతంలోని గ్వాడలుపే నది తీరంలో ఉన్న సమ్మర్ క్యాంప్‌ను ఆకస్మికంగా ముంచెత్తాయి. క్యాంప్ నిర్వాహకుల ప్రకారం, ఈ ఘటనలో వారి క్యాంప్‌కు చెందిన 27 మంది చిన్నారులు మరియు కౌన్సిలర్లు మరణించారు. మిగతా ఐదుగురు చిన్నారులు, ఒక కౌన్సిలర్ ఆచూకీ లభించలేదని కెర్ కౌంటీ షెరీఫ్ లారీ లీథా తెలిపారు. అప్పటికే క్యాంప్‌లో సుమారు 750 మంది చిన్నారులు ఉన్నారు.

ఇటీవల రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబాట్ మీడియాతో మాట్లాడుతూ, మొత్తం 161 మంది ఇప్పటికీ గల్లంతయ్యారని, గ్వాడలుపే నది ప్రాంతమంతటా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు. ప్రజలు తమకు తెలిసిన వివరాలను అధికారులతో పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సహాయక చర్యలు మరింత వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషాదకర ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ కెర్ కౌంటీని విపత్తు ప్రాంతంగా ప్రకటించారు. అంతర్జాతీయంగా కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తమైంది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ఈ దుర్ఘటనపై తీవ్ర శోకాన్ని వ్యక్తం చేశారు. సెలవుల సమయంలో అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Read more : ట్రంప్ సుంకాల హెచ్చరిక: ఔషధాలపై భారీ ట్యారిఫ్‌లు

One thought on “టెక్సాస్‌లో వరద విషాదం: 109 మృతి, 160 గల్లంతు

Comments are closed.