దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ను పూర్తిగా అరికట్టేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కీలక నిర్ణయాలు తీసుకుంది. జూనియర్లను వేధించేందుకు సీనియర్లు ఏర్పాటు చేసే అనధికారిక వాట్సాప్ గ్రూపులు కూడా ఇకపై ర్యాగింగ్‌కే చేర్చబడ్డాయని యూజీసీ స్పష్టం చేసింది. ఇలాంటి గ్రూపుల ద్వారా జూనియర్లను మానసికంగా వేధిస్తున్నారన్న ఫిర్యాదులు తరచుగా అందుతున్నాయని పేర్కొన్న యూజీసీ, వాటిపై యాంటీ-ర్యాగింగ్ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాలలో పేర్కొంది. విద్యార్థుల భద్రతకు మౌలిక ప్రాధాన్యతనిస్తూ, క్యాంపస్‌లలో ర్యాగింగ్‌కు తావులేని వాతావరణాన్ని ఏర్పాటుచేయాలని స్పష్టం చేసింది. ర్యాగింగ్‌ను నియంత్రించడంలో విఫలమయ్యే విద్యాసంస్థలకు గ్రాంట్లు నిలిపివేత వంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
సామాజికంగా బహిష్కరించడం, బలవంతంగా జుట్టు కత్తిరించమని చెప్పడం, రాత్రంతా మేల్కొనివుండేలా చేయడం, మాటలతో అవమానించడం వంటి చర్యలు కూడా తీవ్రమైన ర్యాగింగ్ చర్యలేనని పేర్కొంది. ఇలాంటి పనులు విద్యార్థుల్లో తీవ్రమైన శారీరక, మానసిక క్షోభకు దారితీస్తాయని, యూజీసీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేసింది.
Read More : Mumbai : అటల్ సేతుపై నుంచి దూకిన డాక్టర్

One thought on “ర్యాగింగ్‌పై యూజీసీ కఠిన చర్యలు”
Comments are closed.