బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో బీసీలకు వ్యతిరేకత నెలకొని ఉందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. ఓబీసీ వర్గానికి చెందిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆ వర్గానికి న్యాయం చేసే అవకాశమొచ్చినా, కేంద్రం ఇప్పటివరకు Telangana అసెంబ్లీలో ఆమోదం పొందిన 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన కవిత, ఈ నెల 17న చేపట్టనున్న రైల్‌రోకోలో ఒక్క రైలును కూడా కదలనివ్వబోమని హెచ్చరించారు. డెక్కన్ నుంచి ఢిల్లీకి వెళ్లే రైళ్లను అనుమతించబోమన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 (డి) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే జీవో జారీ చేసి బీసీ రిజర్వేషన్లు అమలు చేయవచ్చని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జాగృతి పోటీలో ఉండదని, బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులకే మద్దతు ఉంటుందని కవిత తెలిపారు. కేంద్రం బీసీ హక్కులను కాలరాస్తోందని ఆరోపించిన ఆమె, దేశవ్యాప్తంగా ఈ అంశంపై ఉద్యమం కొనసాగుతుందని హింట్ ఇచ్చారు.
Read More : భర్తను గొడ్డలితో నరికి చంపిన ఇద్దరు భార్యలు

One thought on “కేంద్రంపై కవిత మండిపాటు”
Comments are closed.