అమెరికా, బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్య వివాదం మరింత ముదురుతోంది. బ్రిక్స్ కూటమి అవలంబిస్తున్న అమెరికా వ్యతిరేక విధానాలపై తీవ్రంగా స్పందించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆ విధానాలకు మద్దతిచ్చే ఏ దేశంపైన అయినా అదనంగా 10 శాతం సుంకాలు విధిస్తామని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంలో ఎలాంటి మినహాయింపులు ఉండబోవని, అందరూ జాగ్రత్తగా గమనించాలని హెచ్చరించారు. సోమవారం తన స్వంత సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో ఈ ప్రకటన విడుదల చేసిన ట్రంప్.. “బ్రిక్స్ విధానాలను అనుసరించే దేశాలపై అదనపు సుంకాలు తప్పవు. ఈ విధానాన్ని అమలు చేయడానికి సంబంధించిన అధికారిక నోటీసులు సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సంబంధిత దేశాలకు పంపుతాం” అని పేర్కొన్నారు. ఇప్పటికే బ్రెజిల్‌లోని రియో డి జెనీరో నగరంలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటన మరింత సంచలనంగా మారింది. ట్రంప్ వ్యాఖ్యలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. “ఈకపక్షంగా సుంకాలు విధించడం, WTO నిబంధనలకు విరుద్ధం. అభివృద్ధి చెందుతున్న దేశాలపై పర్యావరణ పరిరక్షణ పేరుతో వాణిజ్య ఆంక్షలు విధించడం అంగీకారయోగ్యం కాదు” అని ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి.
ప్రస్తుతం బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, ఈజిప్ట్, యూఏఈ, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్ దేశాలు సభ్యులుగా ఉన్నాయి. బ్రిక్స్ ప్రకటన వెలువడిన కొద్ది గంటల వ్యవధిలో ట్రంప్ నుంచి వచ్చిన హెచ్చరిక వాణిజ్య యుద్ధానికి నాంది పలికినట్లుగా అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read More : అమెరికా టెక్సాస్‌లో ఘోర వరదల విలయం

One thought on “ట్రంప్ సంచలనం: బ్రిక్స్‌కు మద్దతిస్తే 10% సుంకం విధిస్తాం!”
Comments are closed.