హిమాచల్ వరదల్లో కుటుంబాన్ని కోల్పోయిన చిన్నారి : video

హిమాచల్ ప్రదేశ్‌లోని విపత్కర పరిస్థితులు ఓ ఏడాది కూడా నిండని చిన్నారి జీవితం మారుస్తాయనుకోలేం. కుండపోత వర్షాల వల్ల ఏర్పడ్డ వరదల్లో ఆ చిన్నారి తల్లిదండ్రులు, నానమ్మ గల్లంతయ్యారు. ఒక్కసారిగా కుటుంబాన్ని కోల్పోయిన 11 నెలల ఆ పసికందు నిరాశ్రయురాలైంది.
ఈ చిన్నారిని అధికారులైన SDM ఎత్తుకుని ఆదరించిన దృశ్యం సోషల్ మీడియాను కదిలిస్తోంది. ఆ చిన్నారిని ఓడలేసి ఆడిస్తున్న వీడియో నెటిజన్ల కళ్లలో నీరు తెప్పిస్తోంది. అనాథగా మారిన ఈ పసికందును ఎవరిదైనా తల్లిదండ్రుల ప్రేమ దొరకాలని ఆకాంక్షిస్తూ నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కొన్ని కామెంట్లలో ఈ చిన్నారిని దత్తత తీసుకోవాలన్నదాకా చర్చ సాగుతోంది.

ప్రకృతి వైపరీత్యాలు అకస్మాత్తుగా జీవితాలను ఎలా తలకిందులు చేస్తాయో చూపించే ఈ సంఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.

One thought on “హిమాచల్ వరదల్లో కుటుంబాన్ని కోల్పోయిన చిన్నారి : video

Comments are closed.