న్యూఢిల్లీ: భౌగోళికంగా వేరుపడినప్పటికీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) ప్రజలు మనవారేనని, వారు భారత్‌లో తప్పక కలవాల్సిన అవసరం ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పీఓకే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
“పీఓకే ప్రజలకు భారత్‌తో విడదీయలేని బంధం ఉంది. వారు మన పౌరులే. రాజకీయంగా వారు మన దేశంలో కలిసే రోజు ఎంతో దూరంలో లేదు. పీఓకే తిరిగి భారత్‌లోకి వస్తుంది. అది శక్తితో కాదు, ప్రజల అభిమతంతో జరుగుతుంది” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
దేశ రక్షణ రంగంలో “మేక్ ఇన్ ఇండియా” ప్రాధాన్యతను హైలైట్ చేస్తూ.. ఇటీవల “ఆపరేషన్ సిందూర్”లో ఉపయోగించిన దేశీయ టెక్నాలజీపై రాజ్‌నాథ్ సింగ్ గర్వం వ్యక్తం చేశారు. “ఇప్పుడు మనం దేశంలోనే ఫైటర్ జెట్లు, మిసైల్ సిస్టమ్స్, యుద్ధ సాంకేతిక వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నాం. ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది” అని వివరించారు.
“ఆపరేషన్ సిందూర్” సమయంలో భారత రక్షణ వ్యవస్థలు శత్రువుల రక్షణలను ఛేదించగల శక్తి ఉన్నాయని చూపించాయని తెలిపారు. ఉగ్రవాద స్థావరాలను, పాక్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని విజయవంతంగా దాడులు చేయడం భారత్ శక్తిని ప్రపంచానికి తెలియజేసిందన్నారు.
పాకిస్థాన్‌పై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఉగ్రవాదాన్ని నడిపించడానికి తక్కువ ఖర్చే కావొచ్చు, కానీ దాని వలన భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ఇది పాకిస్థాన్‌కు ఇప్పుడిప్పుడే అర్థమవుతోందని రాజ్‌నాథ్ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన, బలం మరియు సంయమనం రెండూ భారత్‌కు ఉన్న గొప్ప తత్త్వాలని, ప్రపంచానికి శాంతి, స్థిరత కోసం భారత్ చేస్తున్న కృషి ఇప్పుడు ఫలితాలు ఇస్తోందని చెప్పారు.
Read More : ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

One thought on “రాజ్‌నాథ్ వ్యాఖ్యలు: పీఓకే ఒకరోజు భారత్‌లోనే కలిసిపోతుంది.”
Comments are closed.