మధ్యప్రదేశ్‌లో నదిలో కొట్టుకుపోయిన గ్యాస్ సిలిండర్ లారీ

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బరేలా-కుందమ్ మార్గంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పరియత్ నది వంతెనపై నుంచి ఓ గ్యాస్ సిలిండర్లను లోడ్‌చేసిన లారీ దాటుతున్న సమయంలో నది ఉధృత ప్రవాహానికి లారీ అదుపుతప్పి నదిలోకి కొట్టుకుపోయింది. ఘటన సమయంలో అప్రమత్తమైన డ్రైవర్, క్లీనర్ వెంటనే లారీ నుంచి కిందకు దూకి సురక్షితంగా బయటపడగలిగారు. వారు తక్షణమే బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.

సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. లారీని బయటకు తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Read More : మైసూర్-ఉదయ్‌పూర్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు..

One thought on “మధ్యప్రదేశ్‌లో నదిలో కొట్టుకుపోయిన గ్యాస్ సిలిండర్ లారీ

Comments are closed.