హైదరాబాద్-విజయవాడ : పెను ప్రమాదం తప్పింది

యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం, రెడ్డిబావి వద్ద హైదరాబాద్-విజయవాడ హైవేపై శుక్రవారం ఉదయం అపశ్రుతి చోటు చేసుకుంది. వరుసగా మూడు కార్లు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో రోడ్డుపై కాసేపు ఆందోళన వాతావరణం నెలకొంది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడం ఊపిరి పీల్చుకునేలా చేసింది. కేవలం వాహనాల ముందు భాగాలు, బంపర్లు మాత్రమే దెబ్బతిన్నాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను నియంత్రించారు. వాహనాలను బైపాస్ చేయడంతో భారీ ట్రాఫిక్ జామ్ తప్పింది.

వాహనదారులు వేగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచిస్తున్నారు.

Read More : తిరుమలలో అగ్నిప్రమాదం

One thought on “హైదరాబాద్-విజయవాడ : పెను ప్రమాదం తప్పింది

Comments are closed.