వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువతకు పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలో, యువతను ప్రోత్సహిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఎదగడం మీ చేతుల్లో ఉంటుంది… అయితే మిమ్మల్ని ఎదగడం కోసం ప్రోత్సహించడం, అభివృద్ధి చేయడం నా బాధ్యత” అని జగన్ స్పష్టం చేశారు. “నియోజకవర్గ యూత్ అధ్యక్షుడిగా మారడం ఓ తొలి అడుగు మాత్రమే. మీ చివరి అడుగు ఎమ్మెల్యే కావడమే. ప్రతిపక్షంలో ఉన్నపుడే కొత్తదనానికి విలువ ఏర్పడుతుంది. అందుకే ప్రతిపక్ష నేతగా కూడా ఎవరికైనా ఎదిగే అవకాశం ఉంటుంది” అని ఆయన అభిప్రాయపడ్డారు.
అలాగే, రాబోయే రోజుల్లో తన జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. చివరిగా తన పాదయాత్ర కూడా ఉంటుందని జగన్ పేర్కొన్నారు. పార్టీని మళ్లీ బలోపేతం చేసి, తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Read More : సింగయ్య మృతి కేసులో జగన్కు హైకోర్టు ఊరట…
