జులై 3న నెల్లూరుకు జగన్ పర్యటన ఖాయం

జులై 3న నెల్లూరు నగరానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రానున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “జగన్ హెలిపాడ్‌కు అనుమతి ఇవ్వకపోతే ఇతర మార్గాల్లోనైనా ఖచ్చితంగా ఆయన నెల్లూరుకు వస్తారు. రాష్ట్ర ప్రభుత్వ కుట్రలు, అధికారుల ఆటంకాలు ఆయన పర్యటనను ఆపలేవు,” అని అనిల్ ఆరోపించారు.

“మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కలవకుండా చేయాలని కుట్రలు జరుగుతున్నప్పటికీ, జగన్ ఖచ్చితంగా ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తారు,” అని చెప్పారు. ప్రస్తుతం నెల్లూరులో రాజకీయ వేడి రాజుకుంటున్న నేపథ్యంలో జగన్ పర్యటనకు సంబంధించి అధికార వర్గాల నుంచి అనుమతులు ఆలస్యం కావడంపై వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Read More : ఏపీ హోంమంత్రి అనిత భోజనంలో బొద్దింక కలకలం

One thought on “జులై 3న నెల్లూరుకు జగన్ పర్యటన ఖాయం

Comments are closed.