టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మస్క్ పెట్టిన ‘ది అమెరికా పార్టీ’పై ఇప్పటికే అసహనం వ్యక్తం చేసిన ట్రంప్, తాజాగా మరింత కఠినంగా స్పందించారు.
“నాకొకసారి తల్చితే, ఎలాన్ మస్క్ అమెరికాను వదిలి తన స్వస్థలమైన దక్షిణాఫ్రికాకు వెళ్లిపోతాడు” అంటూ ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలు, శాటిలైట్లకు, రాకెట్‌లకు అమెరికా ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీలు ఉండవని స్పష్టం చేశారు.
టెస్లా సంస్థకు గతంలో అందిన భారీ స్థాయిలోని ప్రోత్సాహకాలు ఇకపై ఉండవని హెచ్చరించారు. “ఎలక్ట్రిక్ వాహనాలకు నేను వ్యతిరేకం. మస్క్‌కి ఇది బాగా తెలుసు. అతను చరిత్రలో భూమి మీద అత్యధికంగా ప్రభుత్వ సబ్సిడీలు అందుకున్న వ్యక్తి” అని ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలతో అమెరికా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. రాబోయే అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో మస్క్, ట్రంప్‌ల మధ్య మాటల యుద్ధం మరింత ఉత్కంఠకు దారి తీస్తుందన్నది విశ్లేషకుల అంచనా.

Read More : ఎలాన్ మస్క్ సంచలనం: ‘ది అమెరికా పార్టీ’ ప్రారంభం…

One thought on “ఎలాన్ మస్క్‌పై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు:”
Comments are closed.