పశ్చిమబెంగాల్‌కు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి ప్రదీప్తానంద అలియాస్ కార్తీక్ మహారాజ్‌పై ఒక మహిళ తీవ్ర ఆరోపణలు చేశారు.
2013 సంవత్సరం నుంచి తమ పరిచయం కొనసాగుతుందని, ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి స్వామి ప్రదీప్తానంద తనపై పలు మార్లు లైంగిక దాడులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే తనపై ఈ ఆరోపణలు అసత్యమని, దానిలో నిజం లేదని, తన ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో బురదజల్లే ప్రయత్నంగా ఈ ఆరోపణలను కొట్టిపారేశారు స్వామి ప్రదీప్తానంద. ప్రస్తుతం ఈ అంశం పశ్చిమబెంగాల్లో సంచలనం రేపుతోంది. పోలీసులు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
Read More : కర్ణాటకలో ఐదు పులుల మృతి కేసు పరిష్కారం…
