“నా కుమార్తె బలికాకూడదని పోరాడాం… ఆర్జీకర్ హత్యాచార బాధిత తండ్రి ఆవేదన

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా న్యాయ కళాశాలలో లా విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో గతంలో ఆర్జీకర్ మెడికల్ కళాశాలలో హత్యాచారానికి గురైన విద్యార్థిని తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

“నా కుమార్తె విషయంలో వేలాది మంది రోడ్లపైకి వచ్చి పోరాడారు. మార్పు వస్తుందని ఆశించాం. కానీ ఇప్పుడు మరో విద్యార్థిని బాధితురాలవడం బాధాకరం. ఇంకెంతమంది అమ్మాయిలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలికావాలి?” అంటూ ఆయన వేదన వ్యక్తం చేశారు. పదేపదే ఇటువంటి ఘోర సంఘటనలు పునరావృతం అవుతున్నాయంటే రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనతే కారణమని తండ్రి ఆరోపించారు. తాజా ఘటనకు సంబంధించి నిందితులు అధికార టీఎంసీ పార్టీకి చెందినవారేనని ఆరోపిస్తూ, బాధితుల పట్ల న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.

“లా విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడిన ముగ్గురు నిందితులకు కఠిన శిక్ష విధిస్తేనే భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ జరగవు” అని స్పష్టం చేశారు. గత ఘటనలో న్యాయం కోసం చేసిన పోరాటం ఫలితం ఇవ్వకపోవడంతో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.

Read More : అధిక వేడి, రద్దీతో 600 మంది భక్తులకు అస్వస్థత

One thought on ““నా కుమార్తె బలికాకూడదని పోరాడాం… ఆర్జీకర్ హత్యాచార బాధిత తండ్రి ఆవేదన

Comments are closed.