అధిక వేడి, రద్దీతో 600 మంది భక్తులకు అస్వస్థత

ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో శుక్రవారం అనుకోని అపశ్రుతి చోటుచేసుకుంది. భారీ భక్తజన సందర్శన, తీవ్రమైన ఉక్కపోత కారణంగా 600 మందికి పైగా భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టంచేశారు.

పూరీ జిల్లాకు చెందిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిషోర్ శతపతి ఈ ఘటనపై మాట్లాడారు. “తీవ్రమైన ఎండ, అధిక రద్దీ వల్ల భక్తులు వాంతులు, ఛాతీలో అసౌకర్యం, కళ్లెదురు తిరగడం, చిన్నపాటి గాయాలు వంటి సమస్యలు ఎదుర్కొన్నారు. ఘటనాస్థలంలో వైద్య బృందాలు వెంటనే స్పందించాయి,” అని తెలిపారు. అస్వస్థతకు గురైన వారిలో అధికభాగం ప్రాథమిక చికిత్స అనంతరం కోలుకున్నారని, వారిని ఇళ్లకు పంపినట్టు తెలిపారు. ప్రస్తుతం 70 మంది భక్తులు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, వీరిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. వీరికి ప్రత్యేక వైద్య బృందాలు చికిత్స అందిస్తున్నాయని తెలిపారు.

అధికారులు భక్తుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన సౌకర్యాలు అందించేందుకు చర్యలు చేపట్టారు. ఉత్సవాలను శాంతియుతంగా ముగించేందుకు అన్ని విభాగాల సమన్వయంతో చర్యలు కొనసాగుతున్నాయి.

Read More : Gang rape case: బీజేపీ-టీఎంసీ మధ్య తీవ్ర మాటల యుద్ధం

One thought on “అధిక వేడి, రద్దీతో 600 మంది భక్తులకు అస్వస్థత

Comments are closed.