తెలుగు చిత్ర పరిశ్రమను డ్రగ్స్ మాఫియాల ప్రభావం నుండి దూరంగా ఉంచే దిశగా సినీ ప్రముఖులు కీలక ప్రకటనలు చేస్తున్నారు. డ్రగ్స్ వాడకంపై టాలీవుడ్ వర్గాలు కఠినమైన సందేశాలు ఇస్తున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, యువ హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఈ అంశంపై స్పష్టమైన హెచ్చరికలు చేశారు.
డ్రగ్స్‌కు పాల్పడినవారిని చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించే చర్యలు తీసుకుంటామని దిల్ రాజు తెలిపారు. ‘‘డ్రగ్స్ తీసుకోవడం అనేది వ్యక్తిగతంగా మాత్రమే కాదు, సమాజానికీ హానికరమైందే. ఇలాంటి వారిని టాలీవుడ్‌లో స్థానం ఇవ్వకూడదు. ఇండస్ట్రీకి ఇది మంచి సందేశం కావాలి’’ అని స్పష్టం చేశారు.
ఇక యువతకు విజయ్ దేవరకొండ సూచనలు చేస్తూ, ‘‘హెల్త్, మనీ, సక్సెస్, రెస్పెక్ట్ ఇవన్నీ జీవితంలో చాలా విలువైనవి. కానీ డ్రగ్స్ వాడటం వల్ల ఇవన్నీ ఒక్కసారిగా చేజారిపోతాయి. మన భవిష్యత్తును మనమే నాశనం చేసుకోకూడదు. అందుకే యువత చాలా జాగ్రత్తగా ఉండాలి’’ అని పిలుపునిచ్చారు.
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర పరిస్థితులపై అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక తండ్రిగా రాష్ట్రం అభివృద్ధి, నగరాల్లో సౌకర్యాలు, స్కూళ్ల పరిస్థితులపై ఆందోళన కలుగుతుందని అన్నారు.
‘‘రేపు మా పిల్లలను బయటకు పంపించాలంటే… రాష్ట్రం ఎలా ఉంది, సిటీ సురక్షితమా?, మంచి స్కూల్స్ ఉన్నాయా? అనే విషయాలన్నీ తల్లిదండ్రులుగా మేం ఆలోచించాల్సి వస్తుంది. ఇది ప్రతి తండ్రి, తల్లి ఎదుర్కొనే సాధారణ పరిస్థితి’’ అని రామ్ చరణ్ పేర్కొన్నారు.
ఇటీవల డ్రగ్స్ కేసులు మళ్లీ తెరపైకి రావడంతో, సినీ ప్రముఖులు ఇచ్చిన ఈ పబ్లిక్ స్టేట్మెంట్లు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. టాలీవుడ్‌ను పరిశుభ్రంగా ఉంచేందుకు ఇలాంటి కఠిన నిర్ణయాలు అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read More : ముంబై ఎయిర్‌పోర్టులో NTR … చేతిలో ‘మురుగ బుక్ ‘

One thought on “టాలీవుడ్‌కి డ్రగ్స్ తీసుకునే వారికి ఎంట్రీ లేదు”
Comments are closed.