బోనాల పండుగ ప్రారంభమైన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త అందింది. రాష్ట్ర ప్రభుత్వం వారి మెడికల్ బిల్లుల బకాయిల చెల్లింపుకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. రూ.180.30 కోట్లు విలువైన పెండింగ్ మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు విడుదల చేసినట్లు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం వెల్లడించారు. ఈ నిధుల ద్వారా మొత్తం 26,519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు నేరుగా లబ్ధి కలగనుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌గా ఉన్న బిల్లులను సైతం ఈ సందర్భంగా క్లియర్ చేసినట్లు భట్టి స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కఠినంగా ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలుతో పాటు ఉద్యోగుల మెడికల్ బిల్లులకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు.
ఈ సందర్భంగా ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల నేతలు స్పందిస్తూ బోనాల వేళ ఇదొక శుభవార్తగా అభివర్ణించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం అని పేర్కొన్నారు. ఈ చర్య ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లలో విశ్వాసం మరింత బలపడుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.
Read More : కుబేర సినిమా చూస్తుండగా కూలిన సీలింగ్

One thought on “బోనాల సందర్భంగా ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త”
Comments are closed.