ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఢిల్లీ యువ క్రికెటర్ రిషభ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్ మ్యాచ్ అనంతరం విడుదలైన తాజా బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పంత్ ఏడో స్థానానికి ఎగబాకాడు.
ఈ జాబితాలో ఆయనకు 801 రేటింగ్ పాయింట్లు లభించాయి. ఈ మేరకు టెస్ట్ ఫార్మాట్‌లో 800 పాయింట్ల మార్క్‌ను దాటిన తొలి భారత వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ గుర్తింపు పొందాడు. ఇది భారత క్రికెట్ చరిత్రలో ఓ మైలురాయి.
ఇప్పటికే జో రూట్ (889), హ్యారీ బ్రూక్ (874), విలియమ్సన్ (867), జైస్వాల్ (851), స్టీవ్ స్మిత్ (824), బావుమా (806)లు టాప్-6లో ఉన్నారు. ఇప్పుడు పంత్ కూడా టాప్-7లో స్థానం సంపాదించడం గర్వకారణం.
ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ అద్భుతమైన శతకాలు బాదిన పంత్ ర్యాంకింగ్స్‌లో భారీగా ఎగబాకాడు. భారత వికెట్ కీపింగ్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ సాధించని రికార్డును ఈ యువక్రీడాకారుడు సొంతం చేసుకున్నాడు.
Read More : లీడ్స్‌లో భారత్‌కు చేదు అనుభవం

One thought on “రిషభ్ పంత్ – 800 పాయింట్లు దాటి అరుదైన రికార్డు”
Comments are closed.