తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు మళ్లీ తాకనున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.
వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం, ఈ రోజు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీ చేశారు. అంతేకాక, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో ఈ ఐదు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించారు. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Read More : చెల్లెలు శోకంతో, పోలీసులు సంచలన విషయాల వెల్లడి.

One thought on “తెలంగాణలో మూడు రోజుల వర్షాల అలెర్ట్”
Comments are closed.