తెలంగాణ ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగలలో బోనాలు ముఖ్యమైనవిగా నిలుస్తాయి. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభంకానున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం బోనాలను అధికారిక పండుగగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించనున్నారు.
గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారికి బోనాల జాతర ప్రారంభమవడం పురాతన సంప్రదాయం. కులీకుతుబ్‌షా కాలం నుంచి వస్తున్న ఈ ఆనవాయితీని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అధికారికంగా నిర్వహిస్తోంది. జూన్ 26 నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు జూలై 24 వరకు కొనసాగనున్నాయి. మొత్తం తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
లంగర్‌హౌజ్ చౌరస్తా నుంచి అమ్మవారి తొట్టెల ఊరేగింపు, చోటా బజార్ ఆలయం పూజారి ఇంటి నుంచి అమ్మవారి విగ్రహం ఊరేగింపు, బంజారాదర్వాజ నుంచి మొదటి బోనం ఊరేగింపుతో పూజలు ప్రారంభమవుతాయి. అనంతరం గోల్కొండ కోటపై ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి బోనం సమర్పిస్తారు.
ఈ నెల బుధవారం అమావాస్య కావడంతో గురువారం నుంచే బోనాల జాతర ప్రారంభమవుతోంది. ఆదివారాలు, గురువారాల్లో కోటకు ఉచిత ప్రవేశం కల్పించిన కేంద్ర పురావస్తు శాఖ, లైట్ అండ్ సౌండ్ షోలో మార్పులు చేసింది. మొదటి షోను రద్దు చేసి రెండవ షోను రాత్రి 8 గంటలకు నిర్వహించనుంది.
బోనాల ప్రత్యేక పూజల షెడ్యూల్
- జూన్ 26 – మొదటి పూజ
- జూన్ 29 – రెండవ పూజ
- జూలై 3 – మూడవ పూజ
- జూలై 6 – నాల్గవ పూజ
- జూలై 10 – ఐదవ పూజ
- జూలై 13 – ఆరవ పూజ
- జూలై 17 – ఏడవ పూజ
- జూలై 20 – ఎనిమిదవ పూజ
- జూలై 24 – తొమ్మిదవ పూజ
అలయాల్లో ఏర్పాట్లను దేవాదాయ శాఖ, స్థానిక అధికారులు సమగ్రంగా నిర్వహిస్తున్నారు. లక్షలాది భక్తులు ఈ జాతరలో పాల్గొననున్నందున భద్రతా ఏర్పాట్లను కూడా బలోపేతం చేశారు.
Read More : Elections – సెప్టెంబర్ 30 లోగా పూర్తి చేయాలని ఆదేశం

One thought on “తెలంగాణలో బోనాల జాతరకు శుభారంభం”
Comments are closed.