హైదరాబాద్‌లో యాంటీ డ్రగ్స్ డే కార్యక్రమం

హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్ వద్ద మంగళవారం నాడు యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, టాలీవుడ్ హీరో నిఖిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

డ్రగ్స్ వ్యసనానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన పెంచే ఉద్దేశంతో షార్ట్ ఫిల్మ్‌ను మంత్రులు, టెలంగాణ న్యాబ్ ఉన్నతాధికారులు సంయుక్తంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా సినీ నటుడు నిఖిల్ మాట్లాడుతూ – “డ్రగ్స్‌కు దూరంగా ఉండటం వల్లనే నేను శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండగలిగాను. ఇదే నా విజయానికి కారణం” అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పోలీసులు, ఎన్జీఓలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డ్రగ్స్ నిర్మూలనపై నిబద్ధతతో ముందడుగు వేయాలని అధికార ప్రతినిధులు పిలుపునిచ్చారు.

Read More : తెలంగాణలో బోనాల జాతరకు శుభారంభం

One thought on “హైదరాబాద్‌లో యాంటీ డ్రగ్స్ డే కార్యక్రమం

Comments are closed.