ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం వెలగాడ గ్రామంలో వర్షాభావం మధ్య వానలు కురవాలని ఆకాంక్షిస్తూ స్థానికులు ప్రత్యేక సంప్రదాయాన్ని పాటించారు. పంటలు బాగా పండాలని కోరుకుంటూ గ్రామస్తులు తరతరాలుగా వస్తున్న “కప్ప తల్లి ఆటలు” నిర్వహించారు.
ఈ పండుగ సందర్భంగా గ్రామస్తులు రోకలిబండకు కొత్త గుడ్డలో కప్పను కట్టి, దానిని బండ మధ్యలో వేలాడదీసి ఊరేగించారు. ఆ కప్పను పసుపు, కుంకుమలతో అలంకరించి గ్రామమంతా తిప్పారు.
ఇంటింటికీ వెళ్లిన ఈ ఊరేగింపులో మహిళలు బిందెలతో నీళ్లు పోస్తూ వరుణదేవుడిని వేడుకున్నారు. వర్షాలు కురిసి భూమి బోసిపోయేలా పంటలు పండాలని ప్రార్థించారు.“ఇది మేం చిన్నప్పటి నుంచి చూస్తున్న సంప్రదాయం. కరువు పడినపుడల్లా కప్ప తల్లి ఆటలు ఆడి గ్రామదేవతను పూజిస్తాం. ఆ తర్వాత తప్పకుండా వర్షం కురుస్తుంది,” అని గ్రామస్తులు తెలిపారు.ఈ ఆచారాన్ని ఊరంతా పెద్ద ఎత్తున జరుపుకోవడం, ప్రజల నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది. ప్రకృతితో మానవుని అనుసంధానాన్ని సూచించే ఈ సంప్రదాయ వేడుక మరోసారి గ్రామాల్లోని ఆధ్యాత్మికతను తెలియజేస్తోంది.
read More : సింగయ్య కుటుంబానికి వైఎస్సార్సీపీ ఆర్థిక సహాయం

One thought on “ఏపీలో వర్షాల కోసం విశేష పూజలు”
Comments are closed.