క్రికెట్ చరిత్రలో మరపురాని క్షణం..!

దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, జేమ్స్ అండర్సన్‌కు అరుదైన గౌరవం లభించింది. ఈ ఇద్దరు లెజెండరీ క్రికెటర్లను గౌరవించేందుకు ‘అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ’ పేరుతో ప్రత్యేక ట్రోఫీని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఇంగ్లాండ్ పేస్ దిగ్గజం సర్ జేమ్స్ అండర్సన్, భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఇద్దరూ కలిసి ఈ కొత్త ట్రోఫీతో ఫోటోకు పోజ్ ఇచ్చారు.

ఈ ట్రోఫీ ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరిగే టెస్ట్ సిరీస్‌కు ప్రతీకగా ఉండనుంది. టెస్ట్ క్రికెట్‌కు గౌరవం చేకూర్చిన ఈ ఇద్దరు ఐకాన్ల పేరుతో ట్రోఫీని నామకరణం చేయడం ప్రపంచ క్రికెట్‌కు గొప్ప ఘనతగా భావిస్తున్నారు.

ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలను మ‌రింత బలపరిచే ఈ పరిణామంపై అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

Read more : భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు ముందు మాటల యుద్ధం.

Our YouTube Channel Click Here

One thought on “క్రికెట్ చరిత్రలో మరపురాని క్షణం..!

Comments are closed.