టెహ్రాన్ నగరంలో జరిగిన మెరుపుదాడిలో ఇరాన్ సైన్యానికి చెందిన ప్రముఖ కమాండర్ అలీ షాద్మానీ హతమయ్యారని ఇజ్రాయెల్ సైన్యం అధికారికంగా ప్రకటించింది. సోమవారం రాత్రి జరిగిన ఈ ఆకస్మిక దాడిపై ఇజ్రాయెల్ వైమానిక దళం స్పష్టమైన ప్రకటనను విడుదల చేసింది.
“టెహ్రాన్‌లోని ఓ కీలక కమాండ్ సెంటర్‌పై ఆకస్మికంగా నిర్వహించిన దాడిలో, ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడైన సీనియర్ మిలిటరీ కమాండర్ అలీ షాద్మానీ హతమయ్యారు,” అని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.
అలీ షాద్మానీ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తో పాటు ఇరాన్ సాయుధ దళాలకూ కీలక బాధ్యతలు నిర్వర్తించారని వెల్లడించింది. ఈ ఘటన ఇజ్రాయెల్ – ఇరాన్ దేశాల మధ్య ఇప్పటికే ఉధృతంగా ఉన్న సంబంధాలకు మరింత మంటపెడుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం ఈ దాడిపై ఇరాన్ ప్రభుత్వ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ పరిణామాలపై అంతర్జాతీయ సమాజం తీవ్రంగా గమనిస్తోంది. టెహ్రాన్ వాతావరణంలో భయాశంకలు నెలకొన్నట్టు సమాచారం.
Read More : కీవ్‌పై రష్యా భారీ దాడులు

One thought on “ఇరాన్ టాప్ కమాండర్ అలీ షాద్మానీ హతం”
Comments are closed.